Sun Mar 01 2026 11:51:38 GMT+0530 (India Standard Time)
Breaking : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... 12 మంది మృతి
నాగపూర్ లో జరిగిన బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగి 12 మంది మరణించారు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగపూర్ లో జరిగిన బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగి 12 మంది మరణించారు. మరో పదిహేనుమందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిసింది.
గాయపడిన వారిని...
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పేలుడు ధాటికి భవనం కుప్ప కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి.
Next Story

