Mon Mar 16 2026 01:10:03 GMT+0530 (India Standard Time)
పదేళ్ల బాలిక సాహసం
చైన్ స్నాచర్ తో పోరాడి తన నానమ్మ నగలను కాపాడిన పదేళ్ల బాలిక ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది

చైన్ స్నాచర్ తో పోరాడి తన నానమ్మ నగలను కాపాడిన పదేళ్ల బాలిక ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. మహారాష్ట్రలోని పూణేలోని శివాజీనర్ లో తన మనవరాళ్లతో కలసి అరవై ఏళ్ల లతా ఘగ్ రోడ్డు పక్కన నడుస్తుండగా అడ్రస్ చెప్పమని స్కూటీపై ఒక యువకుడు వచ్చాడు. అడ్రస్ చెబుతున్న సమయంలో లతా ఘగ్ మెడలో నుంచి గొలుసును లాక్కుని పరారయ్యే ప్రయత్నం చేశాడు.
చైన్ స్నాచర్ తో...
అయితే పక్కనే ఉన్న పదేళ్ల బాలిక ప్రతిఘటించింది. ఆ యువకుడి తన పిడిగుద్దులతో అడ్డుకుంది. దీంతో బామ్మ మెడలో చైన్ ను వదిలేసి యువకుడు స్కూటీ పై పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. బాలిక ధైర్యానికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story

