Mon Mar 09 2026 11:06:18 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు
నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి

నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకూ సమావేశాలు జరగనున్నాయి. తొలివిడత సమావేశాలు హాట్ హాట్ గా ముగిశాయి. రెండో విడత సమావేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొని ఉంటుందని అంటున్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మ ద్య మాటల యుద్ధం జరగనుంది. అయితే తొలిరోజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముందని కూడా చెబుతున్నారు.
మిడిల్ ఈస్ట్ లో యుద్ధం...
దీంతో పాటు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం, దానివల్ల భారత్ పై పడనున్న ప్రభావంపై చర్చించాలని విపక్షాలు సభలో పట్టుబట్టే అవకాశముంది. స్పీకర్ ఓంబిర్లాకు వ్యతిరేకంగా దాదాపు 118 మంది సభ్యులు సంతకాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షం గొంతును నొక్కాలని చూస్తున్నారని, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నాయి. తాను సభా కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ఓం బిర్లా ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ తో పాటు ఓటింగ్ కూడా జరిగే అవకాశముంది.
Next Story

