Mon Apr 13 2026 13:35:34 GMT+0530 (India Standard Time)
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...6గురి మృతి
ఉత్తరప్రదేశ్ హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

ఉత్తరప్రదేశ్ హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఘటన స్థలికి చేరుకున్న...
అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలికిచేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించడమే కాకుండా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

