Thu Mar 19 2026 02:59:00 GMT+0530 (India Standard Time)
Narendra Modi : బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని మోదీ
నేటి నుంచి రష్యాలో బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

నేటి నుంచి రష్యాలో బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు రష్యాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. భారత్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఈ సమావేశంలో ప్రధాని చెప్పనున్నారు.
బ్రిక్స్ సమావేశాల్లో...
రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బయలుదేరి వెళ్లారు. పదహారో బ్రిక్స్ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని వివిధ సమస్యలపై ప్రసంగించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమస్యలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయ వర్గం తెలిపింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. భారత్ - రష్యా సంబంధాలపై చర్చించనున్నారు.
Next Story

