Fri Dec 05 2025 08:02:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కూడా ఇండిగో సర్వీసులు రద్దు.. ప్రయాణికుల ఆందోళన
ఇండిగో ఎయిర్ లైన్స్ లో అంతర్గత సంక్షోభం కొనసాగుతుంది.

ఇండిగో ఎయిర్ లైన్స్ లో అంతర్గత సంక్షోభం కొనసాగుతుంది. సాంకేతిక కారణాలతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగో రోజు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వారికి ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు కూడా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
హైదరాబాద్ లోనూ...
దేశ వ్యాప్తంగా ఈరోజు నాలుగు వందల విమానాలు రద్దయ్యాయి. సగానికిపైగా విమాన సర్వీసులను ఢిల్లీలో రద్దు చేశారు. ఢిల్లీలో రెండు వందలకు పైగా, చెన్నైలో వందకు పైగా, హైదరాబాద్ లో వందకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పైలట్ల వివాదం కారణంగా విమానాలు రద్దయినట్లు తెలిసింది. హైదరాబాద్ నుండి దేశంలోని వివిధ రధాల నగరాలకు వెళ్లాల్సిన 90విమాన సర్వీసుల తో పాటు హైదరాబాద్ కు రావాల్సిన 43 ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నార.
Next Story

