Wed Jan 28 2026 05:31:06 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కూలిన అజిత్ పవార్ ఛార్టెడ్ ఫ్లైట్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ ఫ్లైట్ కూలింది

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ ఫ్లైట్ కూలింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బారామతిలో ఈ విమానం ల్యాండ్ అవుతుండగా క్రాష్ ల్యాండింగ్ అయిందని తెలిసింది. నిన్న మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు ముంబయి వచ్చిన అజిత్ పవర్ నేడు బారామతికి వెళ్లాల్సి ఉంది.
పూర్తి సమాచారం...
అజిత్ పవార్ తో పాటు ఆయన భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే విమానం క్రాష్ అయిన తర్వాత అజిత్ పవార్ తో పాటు ఆయన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ విషయంలో పూర్తి సమాచారం అందాల్సి ఉంది. వారి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story

