Mon Apr 06 2026 19:07:23 GMT+0530 (India Standard Time)
కేంద్రం కొత్త నిబంధన.. టోల్ గేట్ దాటాలంటే?
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద ఇక డిజిటల్ చెల్లింపులే చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిజిటల్ చెల్లింపుల్లో మరో కీలక అడుగు పడనుంది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.
నగదు చెల్లింపులు నిషిద్ధం...
ఈ నెల పదో తేదీ నుంచి వాహనదారులు కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించి.. లావాదేవీల్లో పారదర్శకత పెంచడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం వివరిచింది. టోల్ ప్లాజాలు దాటాలంటే నగదు రహిత చెల్లింపులతోనే సాధ్యమవుతుంది.
Next Story

