Tue Apr 07 2026 13:41:06 GMT+0530 (India Standard Time)
వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల కోసం ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికులు ఇప్పటికే నగరాలు వదిలి సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు.
గుర్తింపు కార్డులు జారీ చేసి...
దీనిని అరికట్టేందుకు ఐదు కిలోల వంట గ్యాస్ సిలిండర్లను వలస కార్మికులకు పంపిణీ చేయాలని, వారికి గుర్తింపు కార్డులు జారీ చేసి ఈ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని, తద్వారా వలస కార్మికుల కష్టాలు తీరతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
Next Story

