Thu Mar 12 2026 16:07:20 GMT+0530 (India Standard Time)
గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులకు స్పెషల్ ఫ్లైట్స్
గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో గల్ఫ్ దేశాల్లో అనేక మంది భారతీయులు చిక్కుకున్నారు. అనేక కారణాలతో గల్ఫ్ పర్యటనలకు వెళ్లిన వారు తిరిగి రాలేక అక్కడే ఉండిపోయారు. దీంతో భారత ప్రభుత్వం వారిని తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలను నడపనుంది.
జెడ్డా నుంచి ప్రత్యేక విమనాలు...
జెడ్డా నుంచి పది ప్రత్యేక విమానాలు ఇండిగో సంస్థ నడపనున్నట్లు ఆ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. యూఏఈలో లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఫుజైరా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి నాలుగు ప్రత్యేక విమానాలు స్పైస్‌జెట్ నడపనుంది. అలాగే దుబాయ్ నుంచి కూడా కొన్ని విమానాలు నడిపి భారతీయులను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

