Thu Feb 12 2026 11:43:03 GMT+0530 (India Standard Time)
నేడు గుజరాత్ మంత్రి వర్గ విస్తరణ
గుజరాత్ లో నేడు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది.

గుజరాత్ లో నేడు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసిన నేపథ్యంలో నేడు విస్తరణ జరగనుంది. ఉదయం 11.30గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో మొత్తం పదిహేను మంది కొత్తవారికి అవకాశం కల్పిస్తారంటున్నారు. మొత్తం 25 మంది సభ్యులతో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.
జడేజా భార్యకు...
రాజీనామా చేసిన వారిలో కొందరిని తిరిగి కేబినెట్ లోకి తీసుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో టీం ఇండియా క్రికెటర్ జడేజా భార్య రివాబా జడేజాకు మంత్రివర్గంలో చోటు దక్కనుందని తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. రాజ్ భవన్ లో అత్యంత నిరాడంబరంగా మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.
Next Story

