Thu Mar 26 2026 09:41:46 GMT+0530 (India Standard Time)
దీని ఖరీదు 23 కోట్లు
ఈ దున్నపోతు ఖరీదు అక్షరాల రూ.23 కోట్ల రూపాయలు. రాజస్థాన్‌లో పశువుల ప్రదర్శనలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది

ఈ దున్నపోతు ఖరీదు అక్షరాల రూ.23 కోట్ల రూపాయలు. రాజస్థాన్‌లో పశువుల ప్రదర్శనలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. చండీగఢ్ రైతు తీసుకొచ్చిన 'షాబాజ్' అనే గుర్రం రూ.15 కోట్లు ధర పలకగా.రాజస్థాన్‌కు చెందిన రైతు తీసుకువచ్చిన 'అన్మోల్' అనే దున్నపోతు ఏకంగా రూ.23 కోట్ల ధర పలికింది.దీంతో ఈ ధరలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
గుర్రం ఖరీదు చూసి...
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ గుర్రం, దున్నపోతుల ప్రత్యేకత ఏంటని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. రెండున్నరేళ్ల వయసున్న షాబాజ్ గుర్రం అనేక బహుమతులు గెలుచుకుంది. కొనుగోలుదారులు తొమ్మిది కోట్లు ఆఫర్ చేసినా, రైతు అమ్మడానికి నిరాకరించారు. అన్మోల్ దున్నపోతును రోజూ పాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్ తో పెంచుతున్నట్లు రైతు తెలిపారు.
Next Story

