Sat Mar 07 2026 20:59:03 GMT+0530 (India Standard Time)
డీజిల్ ట్యాంకర్ పేలి ముగ్గురి మృతి
సూర్యాపేటలో విషాదం చోటు చేసుకుంది. డీజీల్ ట్యాంకర్ పేలడంతో ముగ్గురు మృతి చెందారు.

సూర్యాపేటలో విషాదం చోటు చేసుకుంది. డీజీల్ ట్యాంకర్ పేలడంతో ముగ్గురు మృతి చెందారు. సూర్యాపేటలో డీజిల్ ట్యాంకర్ మరమ్మతులకు గురయింది. అయితే ట్యాంకర్ లో ఉన్న సిబ్బంది రిపేరు చేస్తుండగా ఒక్కసారి పేలుడు సంభవించింది. ఈ పేలుడలో ట్యాంకర్ కు సమీపంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను....
దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స ను అందిస్తున్నారు. ప్రమాదం ఎందుకు జరిగిందో తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

