Sat Mar 07 2026 19:19:06 GMT+0530 (India Standard Time)
నల్లగొండ ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
నల్లగొండ జిల్లా ఎస్పీగా రమా రాజేశ్వరి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు.

నల్లగొండ జిల్లా ఎస్పీగా రమా రాజేశ్వరి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత ఎస్పీగా ఉన్న రంగనాధ్ నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. 2009కి బ్యాచ్ కు చెందిన రమా రాజేశ్వరి గతంలో నల్లగొండ జిల్లాలో అదనపు ఎస్సీగా బాధ్యతలను నిర్వహించారు.
మహిళల రక్షణకు...
రంగనాధ్ ను హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా నియమించారు. ఆయన స్థానంలో రమా రాజేశ్వరి నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తామని, ప్రధానంగా మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తానని రమా రాజేశ్వరి తెలిపారు.
Next Story

