Tue Mar 31 2026 15:07:02 GMT+0530 (India Standard Time)
నల్లగొండలో యముడు.. చిత్రగుప్తుడు
నల్గొండ పోలీసులు విన్నూత్న తరహాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు

నల్గొండ పోలీసులు విన్నూత్న తరహాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. క్లాక్ టవర్ సెంటర్లో యముడు, చిత్రగుప్తుడు ప్రత్యక్షమవ్వడంతో వాహనదారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అయితే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పైన, అతి వేగంపైన ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ రకమైన చర్యలు ప్రారంభించారు.
ప్రమాదకరమైన ప్రయాణం...
హెల్మెట్ లేని ప్రయాణం.. యముడితో సన్నిహితం అని ప్లకార్డుతో కనిపించారు. నల్లగొండలో అరైవ్ అలైవ్ కార్యక్రమంతో పోలీసుల వినూత్న అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. రోడ్డు మీద నిర్లక్ష్యం అంటే ప్రాణాలతో ఆట అని, అతివేగం, మద్యం డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story

