Fri Feb 13 2026 15:40:30 GMT+0530 (India Standard Time)
Telangana : ఉత్తమ్, కోమటిరెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ స్పీప్
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా వెళుతుంది

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా వెళుతుంది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. గత శాసనసభ ఎన్నికల తరహాలోనే నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తొలుత మున్సిపల్ ఎన్నికల్లో తన ప్రచారాన్ని నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభించారు. మిర్యాలగూడలో తొలి సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.
అత్యధిక ఎమ్మెల్యేలు..
దీంతో నల్లగొండలో మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నామినేషన్లకు ముందు కొన్ని వార్డులు ఏకగ్రీవం జరిగేలా చూడగలిగారు.దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధిక్యత కొనసాగిస్తుంది. నల్లగొండ జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా గెలిచారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అత్యధికంగా కాంగ్రెస్ కు చెందిన వారుండటంతో మున్సిపాలిటీల్లో కూడా వారి ప్రభావం పనిచేస్తుందనే చెప్పాలి. అత్యధికంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉండటం కూడా కలసి వచ్చింది.
మూడేళ్లు అధికారంలో...
ఇక నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు మాత్రం కొంత ఆలస్యంగానే వస్తున్నాయి. ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం సరఫరా, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు వంటి అంశాలతో కాంగ్రెస్ పక్షాన ప్రజలు నిలబడ్డారు. నల్లగొండ ప్రజలు మరో మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి ఇతర పార్టీలకు ఓటు వేసినంత మాత్రాన తమ పట్టణం అభివృద్ధి జరగదని భావించి హస్తం పార్టీవైపు మొగ్గు చూపినట్లు కనపడుతుంది.
Next Story

