Fri Dec 05 2025 12:57:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. తుంగతుర్తిలో దామోదర్‌రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.
అధికారిక లాంఛనాలతో...
అయితే ఆయన అంత్యక్రియలు నేడు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి నల్గగొండ ప్రజలకు మాత్రమే కాకుండా తెలంగాణలో సుపరిచితులు. ఆయన పార్ధీవ దేహానికి నివాళులర్పించేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అధికారిక లాంఛనాలతో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించాలని, ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.
Next Story

