Sat Apr 11 2026 10:05:19 GMT+0530 (India Standard Time)
Bus Accident : ప్రయివేటు బస్సు ఢీ.. గాయాలతో బయటపడిన ప్రయాణికులు
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అదృష్ట వశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ఇంటర్ సిటీ ప్రవేట్ బస్సు ప్రమాదానికి గురయింది.
36 మంది ప్రయాణికులుండగా...
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలు వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో వలన ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో డోర్ రాకపోవడంతో వెనక ఉన్న అత్యవసర డోర్ నుండి ప్రయాణికులు బస్సు దిగారు.
Next Story

