Sat Dec 06 2025 09:14:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు రేవంత్ శంకుస్థాపనలు చేసే కార్యక్రమాలివే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి మధ్యాహ్నం దేవరకొండ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి మధ్యాహ్నం దేవరకొండ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం దేవరకొండ లో “ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో” రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. దేవరకొండ మున్సిపాలిటీ లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శేరి పల్లి రహదారిలో బహిరంగ సభ లో పాల్గొననున్నారు.
దేవరకొండ మున్సిపాలిటీలో ...
దేవరకొండ మున్సిపాలిటీలో 13 కోట్ల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణానికి, రెండున్నర కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి డ్రెయిన్లకు, 2 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ట్రాక్ తో సహా అభివృద్ధి పనులకు, 2 కోట్ల రూపాయలతో బిఎన్ ఆర్ పార్కు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 11 కోట్ల 33 లక్షల 46 వేల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళలకు ముఖ్యమంత్రి అందజేయనున్నారు.
Next Story

