Mon Jun 23 2025 04:03:01 GMT+0000 (Coordinated Universal Time)
Hit 3 మూవీ హిట్ అయిందా? ఫట్టయిందా? ఓవర్సీస్ లో ఏమంటున్నారంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన Hit 3 మూవీ పై భారీ అంచనాలున్నాయి.

Hit 3 మూవీ పై భారీ అంచనాలున్నాయి. నాని వైవిధ్యంగా కనిపించే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నాచురల్ నాని యాక్షన్ లో అందిరినీ మెప్పిస్తాడు. తన బిరుదుకు తగినట్లుగాన నటనలోనూ కనిపిస్తాడు. నానిని స్క్రీన్ పై చూస్తుంటే మన ఇళ్లలో ఒక క్యారెక్టర్ కళ్ల ముందు కదిలేట్లు ప్రతి మూవీలో కనపడుతుంది. అందుకే నానికి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారంటే అతి శయోక్తి కాదు. ఎందుకంటే నాని నటించే, నిర్మించే సినిమాలన్నీ వైవిధ్యభరితంగానే ఉంటాయి. హిట్ లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా నాని జర్నీ కొనసాగుతుందనే చెప్పాలి. నాని ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు.
ఫస్ట్ ఆఫ్ తో ...
తాజాగా నాని నటించిన హిట్ 3 మూవీ రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ఈచిత్రం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాని వద్ద మరొక మంచి లక్షణం కూడా ఉంది. అదే యువ దర్శకులను ప్రోత్సహించడం. కథ నచ్చితే చాలు గతంలో డైరెక్ట్ చేశాడా? లేదా? అన్నది పక్కన పెట్టి నటించడానికి నాని ఒప్పేసుకుంటాడన్నది అందరికీ తెలిసిందే. హిట్ మూవీ కూడా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తీసిందే. హిట్, హిట్ 2 హిట్ అవ్వడంతో హిట్ 3 మీద భారీ హైప్ క్రియేట్ అయింది. మరి అయితే ఈ సినిమా ఎలా ఉందని చూస్తే మాత్రం చాలా నిదానంగా నడుస్తుందని, యావరేజ్ టాక్ ఓవర్సీస్ లో వచ్చిందని చెబుతున్నారు. ఫస్ట్ ఆఫ్ బాగాలేదంటూ పెదవి విరుస్తున్నారు.
కొన్నిసీన్స్ అదరగొట్టినా...
క్లైమాక్స్ సీన్స్ అదరగొట్టినా, నాని నటన అద్భుతంగా ఉన్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ మూవీని దెబ్బతీసిందంటున్నారు. సెకండ్ ఆఫ్ మాత్రం చాలా వరకూ దర్శకుడు బాగా నడిపాడని చెబుతున్నారు.కొన్ని ఊహించని ట్విస్ట్ లతో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు రక్తికట్టినా కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే హిట్ 3 చేరినట్లు టాక్ వచ్చింది. సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ సంగీతం అంతగా అలరించలేదని అంటున్నారు. హిట్ 3 మూవీలో వయలెన్స్ ఎక్కువగా ఉండటంతో కొన్ని వర్గాలు ముఖ్యంగా నానిని అభిమానించే పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటారని అంచనా. అయితే కొందరికి మాత్రం ఈ మూవీ మేకింగ్ నచ్చుతుందంటున్నారు. అయితే నాని హిట్ 3 మూవీ మాత్రం అంచనాలకు మించి మాత్రం లేదన్నది ఓవర్సీస్ టాక్. థియేటర్లలో కూడా కొంత నిరాశతో నాని ఫ్యాన్స్ వెనుదిరుగుతున్నట్లు చెబుతున్నారు.
Next Story