Mon Jan 12 2026 04:34:55 GMT+0000 (Coordinated Universal Time)
మన శంకరవరప్రసాద్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేటర్లలో విడుదలయింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేటర్లలో విడుదలయింది. అనిల్ రవిపూడి దర్శకత్వంలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రపోషించిన మూవీపై తొలి నుంచి భారీగా అంచనాలు వినపడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా సోమవారం థియేటర్లలో విడుదలైంది. అనిల్ రవిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉంది. చిరంజీవితో పాటు నయనతార, వెంకటేష్, క్యాథరిన్ ట్రెసా, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై తొలి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన ఆసక్తికరంగా మారింది.
న్యూ లుక్ తో...
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై ప్రేక్షకులు ఏమంటున్నారంటే...సంక్రాంతి పండగకు విడుదలయిన ఈ మూవీ థియేటర్లలో ఒక ఊపు ఊపుతుంది. మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ తో అదరగొట్టేశారు. ఇక కథతో పాటు కామెడీని పండించడంలో చిరంజీవి మరింత ఫ్యాన్స్ కు చేరువయ్యారు. గతంలో చిరంజీవి నటించిన హాస్య సినిమాలు గుర్తుకు తెప్పించేలా ఆయన నటన కొనసాగింది. సెంటిమెంట్ తో పాటు వినోదాన్ని అందించడంలో మరోసారి అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారని చెప్పాలి. చిరంజీవి నాటి టైమింగ్ తో పాటు వింటేజ్ లుక్ ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసింది. మరొకవైపు వెంకటేష్ కూడా అతిధి పాత్రలో కనిపించినా ప్రేక్షకులకు మరింత మూవీని దగ్గరకు చేర్చారు.
అన్ని కలగలపి...
ఈ మూవీలో ఆద్యంతం చిరంజీవి వన్ మ్యాన్ షోగా వ్యవహరించారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ చిరంజీవి నటన అద్భుతమంటున్నారు.ఈలలు, చప్పట్లతో థియేటర్లు మారుమోగిపోతున్నాయి. ఇక యాక్షన్ సన్నివేశాలాకు, డ్యాన్స్ లకు తనకు ఈ వయసులోనూ ఎవరూ సాటిరారని మరోసారి చిరంజీవి రుజువు చేశారు. ఈ సినిమాకు చిరంజీవి లుక్స్, నటన హైలెట్ గా నిలిచాయి. హాస్యం పాటలు అదనపు బలంగా మారాయి. క్లైమాక్స్ తో పాటు భీమ్ అందించిన సంగీతం కూడా మరింత బలం చేకూరింది. సెకండాఫ్ ఆరంభంలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించినా మొత్తం మీద సంక్రాంతికి ఈ మూవీ హిట్ కొట్టినట్లేనని మెగాస్టార్ అభిమానులు మురిసిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story

