Fri Dec 05 2025 12:23:36 GMT+0000 (Coordinated Universal Time)
Kannappa : కన్నప్ప అంచనాలను అందుకుందా? మంచు విష్ణుకు హిట్ తెచ్చిపెట్టిందా?
మంచు కుటుంబం నుంచి భారీ బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.

మంచు కుటుంబం నుంచి భారీ బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచువారి డ్రీమ్ ప్రాజెక్టు. వంద కోట్లకుపైగా ఖర్చు చేసి శ్రమతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచు విష్ణు మార్కెట్ తక్కువగా ఉన్నప్పటికీ ఆయనతో మూవీ చేసి మోహన్ బాబు కుటుంబం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఈ చిత్రంలో మంచు విష్ణు తిన్నడి పాత్ర ప్రధానంగా పోషిస్తుండగా మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి వారితో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ కూడా ఉండటంతో పాన్ ఇండియా మూవీగా విడుదలయింది. ఇప్పటికే కన్నప్ప మూవీకి సంబంధింటి ఓవర్సీస్ రివ్యూలు, ట్విట్టర్ రివ్యూలు వచ్చేశాయి.
ఓవర్సీస్ లో ....
భారీ అంచనాల మధ్య కన్నప్ప నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప నాడు బాక్సాఫీసు బద్దలు కొట్టింది. కథ గురించి ఆసక్తి లేకపోయినప్పటికీ సినిమా ఎలా తీశారన్న దానిపై ప్రధానంగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అందులో ప్రభాస్ కూడా నలభై నిమిషాలు పాటు ఉండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు కూడా సినిమాల విరామంలో ఇది కొంత ఊరట అని చెబుతున్నారు. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ కావడంతో సినిమాను చూసి వచ్చిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా తిన్నడు (మంచు విష్ణు) బ్యాక్ స్టోరీగా ఉందట.
ఫస్ట్ హాఫ్ మాత్రం...
ఫస్ట్ హాఫ్ సో.. సో గా నడిచిందంటున్నారు. ఇంటర్వెల్ వరకూ కొంత సినిమా రక్తి కట్టించలేదని ప్రేక్షకులు ట్విట్టర్ లో చెబుతున్నారు. నాస్తికుడిగా ఉన్న తిన్నడు శివభక్తుడిగా ఎలా మారాడు? శివుడి దర్శనం ఎలా జరిగింది? అయితే తర్వాత సెకండ్ హాఫ్ నుంచి సినిమా మంచి ఊపు అందుకుందంట. ఇక చివరి నలభై నిమిషాలు మాత్రం కన్నప్ప ప్రేక్షకుడిని కట్టిపడేసిందంటున్నారు. ప్రేక్షకుడు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే ఫీలింగ్ ముఖ్యం కావడంతో అదే అసలైన టాక్ గా భావించవచ్చు. చివరి నలభై నిమిషాలు ప్రభాస్ ఎంట్రీతో రక్తికట్టడంతో సినిమా మంచి హైప్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలు వినపడుతున్నాయి. మంచు విష్ణు నటన హైలెట్ గా ఉందట. నిర్మాణ విలువలు కాస్త తగ్గినట్లు అనిపించినా ఓవరాల్ గా సినిమా మంచి టాక్ తెచ్చుకుందని అంటున్నారు.
Next Story

