బెల్లంకొండకు హిట్టివ్వడం బోయపాటికి లైఫ్ అండ్ డెత్ గేమ్

బెల్లంకొండకు హిట్టివ్వడం బోయపాటికి లైఫ్ అండ్ డెత్ గేమ్బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి చిన్న హీరోతో సినిమా చేస్తున్నాడంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. కానీ భారీ ఆఫర్ కాదనుకోలేక సినిమా చేస్తున్నట్లు గుసగుసలు ఉన్నాయి. కాకపోతే రెండు ప్లాప్ ల ట్రాక్ రికార్డు తో ఉన్న బెల్లంకొండకు మంచి హిట్టివ్వడం బోయపాటికి ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ గేమ్ గా మారిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
విషయం ఏమిటంటే.. తన 151వ చిత్రం చేయడానికి మెగాస్టార్ చిరు , బోయపాటికి ఛాన్స్ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ మొత్తం వ్యాపించింది. సరిగ్గా చిరు దానిని స్టార్ట్ చేయదలచుకునే ముందు బెల్లంకొండ-బోయపాటి సినిమా రిలీజ్ అవుతుంది. అది గనుక ఫలితం తేడా కొట్టిందంటే , ఇక అంతే సంగతులు. లేటెస్ట్ ప్లాప్ ఉన్న డైరెక్టర్ తెజో సినిమా చేయడానికి చిరు ఓకే అంటారనుకోవడం భ్రమ.
గతంలో చిరంజీవి తో సినిమా ఓపెనింగ్ కూడా అయిన తరువాత దర్శకుడు వీఎన్ ఆదిత్య , రెండు నెలలు గ్యాప్ వచ్చింది కదా అని, ఉదయకిరణ్ తో శ్రీరామ్ చిత్రం చేసాడు. తీరా అది ప్లాప్ అయింది. చిరు చాలా నిర్దాక్షిణ్యంగా ఆదిత్య సినిమాను బుట్టదాఖలు చేసారు. ఇప్పుడు బెల్లంకొండ సినిమా తేడా కొడితే బోయపాటి పరిస్థితి అంతేనని సినీ పండితులు అంటున్నారు.
అందుకే బోయపాటి కూడా చాల పట్టుదలగా ఆ చిత్రం చేస్తున్నారట. దానిని మల్టీ స్టారర్ గ మార్చి అయినా సరే హిట్ కొట్టాలని అనుకుంటున్నారుట

