' హలో ' ఫస్ట్ డే కలెక్షన్స్... దెబ్బ పడిందిగా...

అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ హలో నిన్న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించగా, అఖిల్ సరసన మళయాళ దర్శకుడు ప్రియదర్శిన్ - సీనియర్ హీరోయిన్ లిజి దంపతుల కుమార్తె కళ్యాణి ప్రియదర్శని హీరోయిన్గా నటించింది.
క్యూట్ లవ్ స్టోరీ, ఎమోషనల్, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి రోజు జస్ట్ ఓకే అన్న టాక్ వచ్చింది. తొలి రోజు ఓవర్సీస్లో హలో మంచి వసూళ్లే రాబట్టినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం కేవలం రూ 3.10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అఖిల్ తొలి సినిమా అఖిల్ - ది పవర్ ఆఫ్ జువా రాబట్టిన రూ 7.57 కోట్ల కలెక్షన్లతో పోలిస్తే ఈ సినిమా సగం కూడా రాబట్టలేదు.
ఎంసీఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సబ్జెక్టుతో తెరకెక్కడంతో పాటు బీ, సీ సెంటర్లకు కనెక్ట్ అవ్వడం, ఎక్కువ థియేటర్లు దొరకడంతో ఎంసీఏకు తొలి రెండు రోజులకు ఏకంగా రూ 10.81 కోట్ల షేర్ వచ్చింది. తొలి రోజే ఎంసీఏకు రూ 7 కోట్ల షేర్ వచ్చింది. ఇక హలో కొన్ని వర్గాల ప్రేక్షకులకే పరిమితం కావడంతో ఆ సినిమాకు వసూళ్ల పరంగా తొలి రోజు గట్టి దెబ్బే పడింది.
' హలో ' ఫస్ట్ డే ఏపీ+తెలంగాణ షేర్ : ( రూ. కోట్లలో )
నైజాం - 1.18
సీడెడ్ - 0.48
గుంటూరు - 0.40
ఉత్తరాంధ్ర - 0.33
కృష్ణా - 0.22
వెస్ట్ - 0.21
ఈస్ట్ - 0.18
కృష్ణా - 0.10
-------------------------------------
ఏపీ+తెలంగాణ = 3.10 కోట్లు
-------------------------------------

