హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ బాగానే ఇరుక్కున్నాడు

అంజలి బాయ్ ఫ్రెండ్ తమిళ హీరో జై ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. హీరో జై తెలుగులో జర్నీ సినిమాతో బాగా ఫెమస్ అయ్యాడు. ఇక తమిళంలో మాత్రం కొన్ని సినిమాలతో బిజీగా వున్నా అంజలి తో ఎఫ్ఫైర్ కారణంగా బాగా హైలెట్ అయ్యాడు. అంజలి, జై లు డీప్ లవ్ లో ఉన్నారని.. త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే జై ఇప్పుడు తప్పించుకోలేని ప్రాబ్లెమ్ లో ఇరుక్కున్నాడు. మొన్నామద్యన చెన్నైలో షూటింగ్ ముగించుకుని వెళ్ళేటప్పుడు ఫుల్ గా మందు కొట్టి కారు నడిపి పక్కన ఉన్న డివైడర్ ని ఢీకొట్టి నానా భీబత్సం సృష్టించిన ఇతనిపై పోలీస్ లు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు.
అంతేకాకుండా పోలీస్ లు కోర్టుని ఆశ్రయించగా.... కోర్టు జై ని తమ ముందు హాజరు కావాలని ఆదేశించగా.... బుధవారం కోర్టు కు హాజరయిన జై... ఆ తరవాతి రోజు మాత్రం కోర్టుకు హాజరు కాకుండా... లైట్ తీసుకోవడంతో కోర్టు వారు జై ని తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరచమని పోలీస్ లను ఆదేశించింది. పోలీస్ లు జై దగ్గరకి వెళ్ళడానికి సమాయత్తమవగా జై అందుబాటులో లేకపోవడం తో అదే విషయాన్నీ పోలీస్ లు కోర్టు వారికి విన్నవించగా.. దీనితో మెట్రోపాలిటన్ కోర్టు జై పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
మరి నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే జై ని పోలీస్ లు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించడమే. దెబ్బకి జై ఎవ్వరికి చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడట. అయితే జై కి ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడడం కొత్తకాదు. ఇంతకు ముందు కూడా జై మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైనట్టుగా పోలీస్ లు తెలపడమే కాదు... జై డ్రైవింగ్ లైసెన్సు రద్దు చెయ్యాలని.. పోలీస్ లు కోర్టు వారికి విన్నవించుకున్నారు. మరి పాపం అంజలి... జై ని ఎలా కాపాడుకుంటుందో అని సెటైర్ వేస్తున్నారు కొందరు.

