హీరో నిర్మాతగా మారితే ఎంత లాభమో కదా

తన తండ్రి చిరంజీవి 150 వ సినిమాతో నిర్మాత అవతారం ఎత్తిన రామ్ చరణ్.. నిర్మాతలు ఎలా వ్యవహరించాలో... సినిమాల విషయంలో ఎంత కాలిక్యులేటెడ్ గా ఉండాలో అనే విషయాలను బాగానే వంటబట్టించుకుంటున్నట్టుగా కనబడుతున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాకి ఎంతో జాగ్రత్తగా 60 నుండి 65 కోట్ల మధ్యన ఖర్చు పెట్టి దానికి డబుల్ లాభాలను జేబులో వేసుకున్నాడు. కేవలం తాను నిర్మాతగా ఉన్న సినిమాలనే కాకుండా తాను నటించే సినిమాల విషయంలోనూ బడ్జెట్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తన నిర్మాతలను సేవ్ చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది.
ఇప్పటికే తాను నటించిన ధ్రువ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత లాభాల్లో వాటా తీసుకున్నాడు. ఇక తన తండ్రి చిరు విషయంలోనూ చరణ్ అలాగే చేసాడు. చిరు కి పారితోషకం ఇవ్వకుండా లాభాల్లో వాటా ఇచ్చాడు. మరి నిర్మతగా సూపర్ అనిపించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన తండ్రి 151 వ సినిమా సై రా నరసింహారెడ్డి చిత్రానికి కూడా ఎటువంటి తడబాటు లేకుండా నిర్మాతగా తన బాధ్యతలను చక్కబెట్టడమే కాదు.. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తీరుకు అందరూ ఆశ్చర్యపోతున్నారట.
ఇక రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న రంగస్థలం విషయంలోనూ రామ్ చరణ్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. రంగస్థలం షూటింగ్ లో ప్రతి షెడ్యూల్ కి ఎంత ఖర్చవుతుంది... అనే విషయాలను కూడా రామ్ చరణ్ అడిగితెలుసుకోవడమే కాదు.. నిర్మాతలకు భారీ ఖర్చు అవ్వకుండా చూసుకుంటున్నాడట. అలాగే చరణ్ చూపిస్తున్న శ్రద్ద వలన రంగస్థలాని భారీ ఖర్చు కాకుండా నిర్మాతలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంన్నారట. మరి ఒక హీరో నిర్మతగా మారితే..... ఎంత లాభమో చరణ్ ని చూస్తుంటే అర్ధమవుతుంది.

