హిరణ్యకశిప గా రానా?

బాహబలిలో భళ్లాలదేవుడిగా ఇరగదీసిన రానా సోలో హీరోగా విజయాలు కొల్లగొడుతున్నాడు. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు హిట్స్ కొట్టిన రానా ఇపుడు తాజాగా 1945 కూడా చెయ్యబోతున్నాడు. ఇక రానా బాహుబలి కన్నా ముందే రుద్రమ దేవి చిత్రంలో నటించించి మెప్పించాడు. గుణశేఖర్ దర్శత్వంలో తెరకెక్కిన రుద్రమదేవిలో అనుష్క మెయిన్ లీడ్ కాగా, అల్లు అర్జున్ , రానా లు నటించారు. అయితే ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో మరోమారు నటించబోతున్నాడట రానా.
రుద్రమదేవితో హిట్ కొట్టిన గుణశేఖర్ ఇప్పుడు తాజాగా హిరణ్యకశిప సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ సినిమాలో హిరణ్యకశిపుడు రోల్ కి రానా ని సెలెక్ట్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక హిరణ్యకశిపుడు పాత్ర చెయ్యడానికి రానా కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే రానా హీరోగా... గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని సురేష్ బాబు తమ బ్యానర్ లో నిర్మించడానికి సిద్దమవుతున్నాడట. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన కథ చర్చలు కూడా సురేష్ బాబు కి రానాకీ గుణశేఖర్ కి మధ్యన జరిగినట్లుగా కూడా చెబుతున్నారు. ఇంకా హిరణ్యకశిపకు సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

