హాట్నెస్ శాపంగా మారిందా?

శీరత్ కపూర్ అవకాశాల కోసమే హాట్ ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయింది. కానీ అవకాశాల కోసం అలా గ్లామర్ షో చెయ్యాల్సిన అవసరం లేదని శీరత్ ఎంత గట్టిగా వాదించినా నమ్మేవాళ్ళెవ్వరూ లేరు ఇక్కడ. ఇక సోషల్ మీడియాలో శీరత్ హాట్ గ్లామర్ ఫోటో షూట్స్ చూసాకే రాజుగారి గది 2 లో ఓం కార్ ఒక గ్లామర్ పాత్రనిచ్చాడు. అందులో శీరత్ పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా... కేవలం గ్లామర్ షో చెయ్యడానికి అవకాశం దొరికింది. కానీ అందులో శీరత్ గ్లామర్ షో ప్లాప్ అయ్యింది. అలాగే తాజాగా రవితేజతో కలిసి నటించిన టచ్ చేసి చూడు సినిమా కూడా టపా మంది. ఇందులో కూడా శీరత్ కపూర్ కి గ్లామర్ షో తప్ప మారేది దక్కలేదు.
అయితే ఇపుడు ఆ గ్లామర్ షోకి కాలం చెల్లినట్టే కనబడుతుంది. ఏదో అంద చందాలతో చెలరేగిపోతూ చిన్న చితక సినిమాల్తో కాలం వెళ్లదీస్తున్న శీరత్ కి ఒక సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారుతూ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హర్ష వర్ధన్ రానే ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. అయితే మరో ముఖ్య పాత్రకి హీరోయిన్ శీరత్ కపూర్ ని ఫైనల్ చేశారట. కానీ ఇప్పుడు ఈసినిమాలో శీరత్ ని తప్పించి రిచా పనాయ్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. కారణం శీరత్ హాట్ గా ఉంటుంది.... అందులోను శ్రీధర్ తెరకెక్కించబోయే సినిమా కుటుంబ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి హాట్ హీరోయిన్ శీరత్ బాగోదు కాబట్టి... రిచా పనాయ్ అయితే.. తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది కాబట్టి ఆమెను తీసుకున్నారట.
ఏదో..హాట్ షో చేస్తే అయినా అవకాశాలు వస్తాయని హాట్ ఫోటో షూట్స్ చేయించుకున్న శీరత్ కి ఇప్పుడు ఈ హాట్ ఫోటో షూట్స్ శాపం అయ్యాయి. పాపం శీరత్ కపూర్.

