హాజరా....? అరెస్టా..?

టాలీవుడ్ లో కొంతమంది సినీప్రముఖులుకు సిట్ కార్యాలయం డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక నోటీసులు అందుకున్న వారు ఖచ్చితంగా సిట్ ముందు హాజరు కావాలని కూడా అధికారులు చెబుతున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నారు. మరి ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిలో పూరి, రవితేజ, ముమైత్ ఖాన్, ఛార్మి, తరుణ్, నందు, నవదీప్, చిన్న, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తనీష్, శ్రీనివాస రావు లు ఉన్నారు. ఇక వీరు తమకిచ్చిన డేట్స్ లోనే సిట్ విచారణ ఎదుర్కోవాలని.... ఒక్కొక్కరికి ఒక్కో డేట్ ఇచ్చింది సిట్.
మరి హైదరాబాద్ లో ఉన్న వారు సిట్ ఎదుట తమ తమ తేదీల్లో విచారణకు హాజరవుతారు. కానీ అవుట్ డోర్ షూటింగ్స్ లో ఉన్నవారు ఎలా సిట్ ముందుకు వస్తారు. అలాగే విచారణ తేదీలు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇక అందరి సంగతి ఏమో గాని ఇప్పుడు ముమైత్ ఖాన్ ఇంకా డ్రగ్ కేసులో నోటీసులు అందుకోలేదంట. కారణం అధికారులు ఆమెకు నోటీసులు ఇవ్వడానికి సోమాజిగూడలోని ముమైత్ ఇంటికి వెళ్లగా అక్కడ ఆమెలేదట. కనీసం ఆమె ఉండే ముంబై నివాసానికైనా నోటీసులు పంపుదామని అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయట. ఇక తనని ఈ కేసులో ఇరికిస్తున్నారని తనకి ఈ కేసుకు అస్సలు సంబంధం లేదని... రాక రాక హైదరాబాద్ వస్తే భలేగా వెల్కమ్ చెప్పారంటూ వెటకారమాడింది.
ఇది జరిగాక ముమైత్ తాజాగా పూణే లో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటుంది. మరి బిగ్ బాస్ హౌస్లోకి ముమైత్ ఆల్రెడీ ఎంటర్ అవడంతో ఆమెకు ఈ ప్రపంచంతో 70 రోజులు సంబంధాలు తెగిపోతాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ముమైత్ ఈ కేసు నుండి కొన్ని రోజుల పాటు ఎస్కెప్ అయినట్లేనా?. కాదు అంటున్నారు. అక్కడ బిగ్ బాస్ షో జరుగుతున్న చోటికి పోలీసులు వెళ్లి ఆమెకు నోటీసులు అందజేస్తారని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ షోలో ఇంట్రెస్ట్ గా పార్టీపెట్ చేస్తున్న ముమైత్ ఈ నోటీసుల వలన బయటికి వచ్చి విచారణలో పాల్గొంటే గనక ఆమె ఖచ్చితంగా కావాలని షో నుండి ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఒక వేళ నోటీసులకు కేర్ చెయ్యకపోతే విచాచరణకు హాజరవ్వనందుకు గాను ఆమెను అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

