హలో ఈవెంట్ లో.. సుమ తన మనసులోని మాట

మెగా స్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు. నాగార్జున - చిరంజీవి మధ్యన ఎంత అండర్ స్టాండింగ్ ఉందొ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బుధవారం జరిగిన హలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవితో పాటు తన కుమారుడు రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అవడం అందరినీ అలరించింది.
హలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పక్కనే నాగార్జున..ఆ పక్కనే కూర్చున్న రామ్ చరణ్..ఈ విజువల్ చుస్తే ఇరువురి అభిమానులకి , ప్రేక్షకులకి ఓ తెలియని అనుభూతి. మరి అక్కడే పక్కనే నిలబడిన యాంకర్ సుమ పరిస్థితి ఏం కావాలి. అందుకే తన మనసులోని మాటలను బయటకే చెప్పేసింది ఆమె. 'నాగార్జున.. పక్కనే చిరంజీవి, పక్కపక్కనే కూర్చున్న విజువల్ చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు. ఈ కాంబినేషన్ సూపర్బ్ గా ఉంది. అలాగే ఈ కాంబోలో ఓ సినిమా కూడా చేస్తే బాగుంటుంది కదా' అనేసింది సుమ.
అంతే కాదు.. ఆ పక్కనే రామ్ చరణ్ ఉండటం కూడా మరీ అద్భుతంగా ఉందని తెలిపింది. ఈ విజువల్ చూసిన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కు ఏదొక మాస్టర్ ఐడియా వచ్చివుంటదని సుమ చెప్పిన మాటలు అందరిలోనూ ఆసక్తి కలిగించాయి. మరి నిజంగా ఈ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే కచ్చితంగా ఆ సినిమా అద్భుతంగా ఉంటదని చెప్పగలం.

