హమ్మయ్య ఫోజ్ మార్చాడు

గత ఏడాది మార్చ్ నుండి ఈ మార్చ్ వరకు ఒక ఏడాది కాలంగా రామ్ చరణ్ గెడ్డం పెంచేసి చిట్టి బాబు లుక్ లోనే ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ రంగస్థలం కోసం తన గెడ్డాన్ని బూచోడు మాదిరి పెంచాడు. ఇక ఏడాది కాలంగా రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అంటే పర్సనల్ లైఫ్ లో భార్య తో వెళ్ళినా అదే గెడ్డం లుక్ ని మైంటైన్ చేసేవాడు. ఎందుకంటే హ్యాండ్సమ్ గా ఉండడానికి గెడ్డం తీసేస్తే మళ్ళీ పెంచడానికి నానా తిప్పలు పడాలి. అందుకే చరణ్ అప్పటినుండి ఇప్పటివరకు గెడ్డంతోనే దర్శనమిచ్చాడు. ఇక ఎట్టకేలకు రంగస్థలం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయినా చరణ్ లుక్ లో మార్పు లేదు.
మరి బోయపాటి సినిమా షూటింగ్ కి జాయిన్ అవ్వాలంటే రామ్ చరణ్ ఖచ్చితంగా గెడ్డం తీసేసి సాఫ్ట్ అండ్ మాస్ లుక్ లోకి మారాలి. అయితే తాజాగా అమెరికాకి వెళ్లొచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు ఒక స్టైలిష్ లుక్ లో బయట తిరుగుతున్నాడు. ఎట్టకేలకు గెడ్డం తీసేసి హ్యాండ్సమ్ లుక్ లోకి మారిపోయాడు చరణ్. క్లీన్ షేవ్ లుక్ తో అదరగోడుతున్న రామ్ చరణ్ ని చూసిన మెగా అంభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ కూడా మరో రెండు రోజుల్లో రంగస్థలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వైజాగ్ లో గ్రాండ్ లెవెల్ లో జరగబోతుండగా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు.
మరి ఇప్పుడు రంగస్థలం విడుదల కాకమునుపే రామ్ చరణ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటి సినిమా సెట్స్ మీదకి వెళ్ళిపోతాడు. ఈ సినిమాలో రామ్ చరణ్... కైరా అద్వానీతో రొమాన్స్ చేస్తుండగా....రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


