హమ్మయ్య నిర్మాతలు సేఫ్!

ఎప్పుడు సంక్రాంతికి, దసరాకి సినిమాల మధ్యన గట్టి పోటీ చూసే సదరు ప్రేక్షకులకు ఆగష్టు 11 న ఆ రెండు పండగలు తలపించేలా మూడు హీరోల సినిమాలు థియేటర్స్ లో పోటీ పడ్డాయి. మరి మూడు సినిమాల ముగ్గురు హీరోలు కూడా భారీ బడ్జెట్ పెట్టుకుని మరి థియేటర్స్ లో సందడి చేసినప్పటికీ... అందులో రెండు సినిమాలే విజయం సాధించాయి. రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై' చిత్రాలలో నేనే రాజు, జయ జానకి మాత్రమే కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్లో నిలిచాయి.
ఇక 'నేనే రాజు నేనే మంత్రి' కలెక్షన్స్ లో లాభాలు జేబులో వేసుకోగా ఇప్పుడు 'జయ జానకి నాయక' కూడా ఒక మోస్తరు లాభాలు దక్కించుకుని నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లారనే న్యూస్ వినబడుతుంది. 'జయ జానకి నాయక' ఫస్ట్ వీక్ లో కలెక్షన్స్ డల్ ఉన్నప్పటికీ సెకండ్ వీక్ లో థియేటర్స్ పెరగడంతో 'జయ జానకి నాయక' నిర్మాతలు కష్టాల నుండి గట్టెక్కినట్లే అని చెబుతున్నారు. ఈ చిత్రానికి 36 కోట్ల బడ్జెట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరియు పబ్లిసిటీ కార్య్రక్రమాలకు గాను మరో ఆరు కోట్ల ఖర్చుతో కలిపి ఈ సినిమాకి ఫైనల్ బడ్జెట్ 43కోట్లు అయ్యిందట.
అయితే బోయపాటి మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాకి ముందే మంచి బిజినెస్ జరిగినా మూడు సినిమాల గట్టి పోటీతో బయ్యర్లు నిర్మాతలకు మొత్తం చెల్లించకుండా కొద్దిగా బ్యాలెన్స్ ఉంచినా కూడా సాటిలైట్ రైట్స్ వంటి రాబడితో దాదాపు 41 కోట్లను ఈ ఈసినిమా అప్పుడే రికవరీ చేసింది. ఇకపోతే కర్ణాటక మరియు రెండు ఏరియాలను అమ్మకుండా ఉంచుకోవడంతో అక్కడ వచ్చిన కలెక్షన్స్, తమిళ, మలయాళ డబ్బింగ్ రైట్స్ కి వస్తున్న రేటుని బట్టి నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఈ వారంలో కూడా 'జయ జానకి నాయక' చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తాయనే ధీమాని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమిళ డబ్బింగ్ 'వివేకం, విఐపి 2 ' సినిమాల నెగటివ్ టాక్ తో 'జయ జానకి నాయక'కి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే 'అర్జున్ రెడ్డి' కూడా ఒక తరహా ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటుంది కాబట్టి ఆ అంశం కూడా 'జయ జానకి నాయక'కి కలిసొస్తుందంటున్నారు.

