'స్పైడర్' నిర్మాతకు చరణ్ సహాయం

మహేష్ బాబు - మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన 'స్పైడర్' సినిమా దసరా సంధర్బంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇండియా లోనే అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా 'స్పైడర్' రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాని ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాత్రం ఈ సినిమా వల్ల చాలా నష్టపోయాడట. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు కూడబెట్టుకున్నది మొత్తం ఒక్క సినిమాతో పోయింది అనే ప్రచారం మాత్రం స్టార్ట్ అయ్యింది. మరి కోలుకోలేకుండా నష్టపోయిన ఈ నిర్మాతని ఆదుకోడానికి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకి వచ్చాడు అని చేనుతున్నారు.
మెగా కుటుంబానికి ఎంతో దగ్గర అయిన ఎన్.వి.ప్రసాద్.... రామ్ చరణ్ తో ఇదివరకే 'రచ్చ, ధృవ' సినిమాలకు కో ప్రొడ్యూసర్ పని చేసాడు. మరి రామ్ చరణ్ కెరీర్ లో 'రచ్చ' యావరేజ్ అయినప్పటికీ... 'ధ్రువ' సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టే. ఆ సినిమాలు చేశారనే కృతజ్ఞతా భావంతో ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నఎన్.వి.ప్రసాద్ కి రామ్ చరణ్ డేట్లు ఇచ్చాడట. దాంతో అటు 'స్పైడర్' నష్టాలను పూడ్చమని గొడవ చేస్తున్న పంపిణీదారులకు ఇప్పుడు చరణ్ తో చేసే సినిమాను తక్కువ రేట్లకే ఇస్తానని ఎన్.వి. ప్రసాద్ చెప్పడంతో వారు కూడా కాస్త శాంతించినట్లుగా తెలుస్తోంది.
మరి ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమాలో నటిస్తున్నాడు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఎన్.వి.ప్రసాద్ తో సినిమా చేస్తాడట చరణ్. మొత్తానికి మహేష్ బాబు వల్ల నష్టపోయిన వాళ్లకి రామ్ చరణ్ అండగా నిలిచాడు అని చెప్పొచ్చు.

