స్టార్ట్ చేసింది!!.

దువ్వాడ జగన్నాధం లో ఫుల్ హాట్ గా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టిన పూజ హెగ్డే డీజే సినిమా రిలీజ్ అయ్యాక కొంతకాలం వార్తల్లో ఉంది. కానీ సినిమా విడుదలైన 10 రోజుల తర్వాత పూజ ఎక్కడా వార్తల్లో లేకుండా పోయింది. ఏదో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఎప్పుడో చెయ్యబోయే చిత్రం తప్ప ఎలాంటి అవకాశాలు లేకుండా ఖాళీగా కూర్చున్న ఈ చిన్నది మొన్నామధ్యన షాప్ ఓపెనింగ్ కోసం రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసి వార్తల్లోకొచ్చింది. మరి డిజెలో బికినీతో మతులుపోగొట్టిన పూజ ఇక తానూ గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అనే సంకేతాలు ఫుల్ గా దర్శక నిర్మాతలకు పంపేసింది.
కానీ అమ్మడికి అనుకున్న అవకాశం రాలేదుగాని ఇప్పుడు మాత్రం 'మేగ్జిమ్' మ్యాగజిన్ కోసం ఒక హాట్ ఫోటో షూట్ తో రచ్చ మొదలెట్టింది. పై ఫొటో పూజ 'మేగ్జిమ్' మ్యాగజైన్ కోసం తీయించుకున్నదే. మరి తన అందాలను చూపించి చూపించకుండా చూపిస్తున్న పూజ హెగ్డే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇలాంటి ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తేనన్నా పూజకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయేమో చూడాలి. మరి ఈ పిక్ లో పూజ అందాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడం కాస్త కష్టమేగాని మీరు చూసి ఒకసారి తరించండి మరి.


