సోనాక్షి సిన్హా .. దాచేస్తే దాగని సీక్రెట్
సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో హిట్, ప్లాప్స్ తో దూసుకుపోతుంది. సల్మాన్ తో జోడి కట్టిన చిత్రాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించాయి. అయితే తాజాగా మురుగదాస్ డైరెక్షన్ లో చేసిన అకీరా సినిమా నిరాశపరిచింది. ఈ చిత్రం లో సోనాక్షికి మంచి పేరే వచ్చింది కానీ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేక బోర్లాపడింది. ఇక సోనాక్షి ఇప్పుడు పీకల్లోతు లవ్ లో మునిగి తేలుతుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. బంటి సజదే అనే అతనితో పీకల్లోతు ప్రేమలో ఉందని అంటున్నారు. బంటి సజదేతో కలిసి సోనాక్షి ఎక్కడికి బడితే అక్కడికి తిరుగుతుందని అంటున్నారు.
అయితే సోనాక్షి మాత్రం నేను లవ్ లో పడలేదని అవన్నీ ఒట్టి పుకార్లని కొట్టిపారేస్తుంది. కానీ నిప్పులేనిదే పొగ రాదుగా సోనాక్షి? బంటి సజదే తో ఏ సంబంధం లేకపోతె ఇలా నైట్ షాపింగ్స్ కి అది ఎలా వెళుతున్నావ్ అంటూ కొంతమంది మీడియా వాళ్ళు సూటిగా ప్రశ్నల వర్షంకురిపిస్తున్నారు. అయితే ఒక చోట షాపింగ్ లో సోనాక్షి సిన్హా, బంటి సజదే ఇద్దరు మీడియాకి అడ్డంగా దొరికిపోయారట. ఇక మీడియాకి దొరకడం తో వీరు సైలెంట్ గా మీడియా ని తప్పించుకు వెళ్లిపోయారని టాక్ బయటికి వచ్చింది. ఇక వీరిద్దరిపై పలు రకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చేసాయి. అసలేం లేదంటూనే ఏదో ఉందనే లీక్ చేసేసింది సోనాక్షి. కొన్ని విషయాలు ఎంత దాద్దమన్నా దాగవు. అందులోను మీడియా కి డేగ కళ్ళు ఉంటాయి. ఏ విషయము మీడియాని దాటి తప్పించుకుపోలేదనేది సత్యం.