సైలెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలక్కపోయినా మంచి అవకాశాలతో దూసుకుపోయిన ప్రియమణికి హీరోయిన్ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక కోలీవుడ్ లో కూడా ప్రియమణి ఎంతోకాలం నిలదొక్కుకోలేకపోయింది. చివరిగా బాలీవుడ్ లో కూడా ఒక ఐటెం సాంగ్ చేసినా ప్రియమణి ఫెట్ మారలేదు. అయితే సినిమా అవకాశాలు లేక డాన్స్ షోలకి జడ్జ్ గా మారిన ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్, వ్యాపారవేత్త ముస్తాఫా రాజ్ తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే ముస్తాఫా రాజ్ తో గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకుంది ప్రియమణి. అయితే ఎంగేజిమెట్ అయినా ఏడాది కి ముస్తఫా తో పెళ్ళికి సిద్ధపడిన ఈ భామ తన పెళ్లిని కొన్ని కారణాల వలన చాలా సింపుల్ గా చేసుకోబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇవ్వడమే కాదు.... ఈరోజు బుధవారం ఆ పెళ్లిని చాలా సింపుల్ గా చేసేసుకుంది.
ఈ పెళ్లిని ప్రియమణి - ముస్తఫాలు బెంగళూరు శివాజీనగర్ లో రిజిస్టర్ పెళ్లి గా చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళికి ముందు రోజు అంటే నిన్న మంగళవారం ప్రియమణి తన మెహిందీ వేడుకని మాత్రం గ్రాండ్ గా జరుపుకున్నారని చెబుతున్నారు. అయితే ఈ వేడుకలకి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు తప్ప బయటివారికి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. ఇకపోతే పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకున్న ప్రియమణి రిసెప్షన్ ని మాత్రం రేపు గురువారం గ్రాండ్ గా ఏర్పాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ రిసెప్షన్ కి ప్రియమణి ఇండస్ట్రీ స్నేహితులు, ముస్తఫా వ్యాపార మిత్రులతోపాటే ఇరువురి బంధుమిత్రులు హాజరవుతారని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ ని బెంగళూరులోని కొత్తనూరు దిన్నె మెయిన్ రోడ్ పై ఉన్న ఎలెన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా నిర్వహిచబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఈ రిసెప్షన్ కి సినిమా సెలబ్రిటీస్ భారీగా కూడా హాజరవుతారని సమాచారం అందుతుంది. ఇక ఈ పెళ్లి తంతు ముగియాగానే ప్రియమణి షూటింగ్స్ తోనూ... ఆమె భర్త ముస్తఫా తమ వ్యాపారాలతోను బిజీ కానున్నారు.

