'సై రా..'కి అదిరిపోయే ఆఫర్... సినిమా షూటింగ్ వాయిదా?

చిరంజీవి 'సై..రా నరసింహారెడ్డి' ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సినిమా మాత్రం ఇంతవరకు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోలేదు. అనేక ఇబ్బందుల మధ్యన 'సై రా' షూటింగ్ వాయిదా పడుతూనే వుంది. ఈ నెలాఖరున 'సై రా' షూటింగ్ మొదలు పెడతారనుకుంటే ఇప్పుడు మళ్ళీ వాయిదాపడి నవంబర్ నెలాఖరునుండి గాని డిసెంబర్ మొదటివారం నుండి గాని షూటింగ్ మొదలుపెట్టుకునే సూచనలు కనబడుతున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయి.. అవేమిటంటే... సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ 'సై రా' నుండి తప్పుకోగా... రత్నవేలుని ఆ స్థానంలోకి తీసుకున్నారు. అయితే రత్నవేలు రామ్ చరణ్ 'రంగస్థలం'తో బిజీగా ఉండడంతోపాటు... ఈ మధ్యన చిరు 'సై రా నరసింహా రెడ్డి' లుక్ మార్పులని న్యూస్ ప్రచారంలో ఉంది. మరి ఇన్ని కారణాలతోపాటే ఈ సినిమా కోసం తీసుకున్న టాప్ స్టార్స్ డేట్స్ కూడా సర్దుబాటు కావాల్సి ఉందట. ఈ కారణాలతో 'సై రా' షూటింగ్ నవంబర్ చివరినుండి సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉందంటున్నారు.
మరోపక్క జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ 'సై రా' చిత్రానికి సంబందించిన డిజిటల్ కంటెంట్ కోసం ప్రముఖ అమెజాన్ కంపెనీ భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. టోటల్ 'సై రా సినిమా' డిజిటల్ కంటెంట్ ను తీసుకునేందుకు అమెజాన్ సంస్థ ముందుకు వచ్చిందని...... కేవలం సినిమా హక్కులు మాత్రమే కాకుండా, షూటింగ్ కి సంబందించిన వర్కింగ్ విడియోలు, మేకింగ్ విడియోలు, టీజర్, ట్రైలర్, ప్రోమో సాంగ్స్ ఇలా టోటల్ గా డిజిటల్ కంటెంట్ అంతా ఇస్తే...... భారీ మొత్తం చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చినట్లు గా వార్తలొస్తున్నాయి.
ఆ ఆఫర్ అలాంటి ఇలాంటిది కాదని... సినిమాకి పెడుతున్న పెట్టుబడిలో దాదాపు 10 శాతం ఉంటుందని అంటున్నారు. మరి ఈ ఆఫర్ ని 'సై రా' నిర్మాత రామ్ చరణ్ పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది.... ముంది దాన్ని పూర్తి చేసి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాకే బిజినెస్ వ్యవహారాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో నిర్మాత రామ్ చరణ్ ఉన్నాడని టాక్.

