Sun Dec 21 2025 19:18:16 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్‌స్టార్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్టే

సూపర్ స్టార్ రజని కాంత్. ఈ పేరు చెప్తేనే నాలుగు రాష్ట్రాలు హర్షధ్వానాలతో మార్మోగిపోతాయి. కొన్ని దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ ప్లేస్ పై మరెవరు ఆశ పడే పరిస్థితిని కూడా రజని కాంత్ క్రేజ్ ఇతర హీరోలకి కలిపించలేకపోయింది. 65 సంవత్సరాల వయసులోనూ ఆయన నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ 2 .0 చిత్రీకరణ లో వున్న రజని కాంత్ త్వరలో సినిమా పరిశ్రమ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని వార్తలు వెలువడ్డాయి.
కానీ రజని కాంత్ తదుపరి చిత్రాల ప్రకటనలు ఈ వార్తలను బలహీన పరిచాయి. ప్రస్తుత చిత్రం చిత్రీకరణ దశలో ఉండగానే కబాలి సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమయ్యారు దర్శకుడు పి.ఎ రంజిత్ మరియు ఆయన బృందం. 2017 దీపావళి కి విడుదల కానున్న 2 .0 చిత్రం తరువాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. మరో పక్క దర్శకుడు శంకర్ 2020 నాటికి రోబో సిరీస్ లో మూడవ భాగం వస్తుంది అని వెల్లడించటంతో అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇప్పటికి ప్రకటించిన చిత్రాలు అన్ని విడుదల దశకు చేరే సరికి రజని కాంత్ ఏడు పదుల వయసుకు చేరుకుంటారు. మరి ఈ నిర్విరామ కృషికి విరామం ఎప్పుడు దొరుకుతుందో ప్రస్తుతానికి సమాధానం దొరకటం కష్టమే.
Next Story

