సురేష్ ప్రొడక్షన్స్ కి కాల్ షీట్స్ ఇవ్వలేని స్థితిలో

రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ అంటే తెలియని సగటు ప్రేక్షకుడు వుండరు అంటే అతిశయోక్తి కాదు ఏమో. పాత తరం అగ్ర కథానాయకులు, దర్శకులు నుంచి నేటి తరం యువ కథానాయకుల వరకు దాదాపు అందరితో సురేష్ ప్రొడక్షన్స్ వారు సినిమాలు తీశారు. ఒక దశాబ్ద కాలంగా వారు నిర్మించే సంఖ్యను తగ్గించినప్పటికీ చేస్తున్న కొద్ది చిత్రాలు ప్రేక్షకులకు చేరువ అయ్యే చిత్రాలనే ఆచి తూచి నిర్మాణ రంగంలో అడుగులు వేస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు. దగ్గుబాటి రామా నాయుడు గారి మనుమడు రానా నటుడిగా ప్రయాణం మొదలు పెట్టి ఆరు సంవత్సరాలు దాటిపోయింది. సురేష్ బాబు మేనల్లుడు అక్కినేని నాగ చైతన్య కి నటుడిగా ఏడు సంవత్సరాల అనుభవం.
ఇప్పటి వరకు సురేష్ బాబు నిర్మాణంలో ఈ ఇద్దరు యువ నటులు సినిమా చేసే అవకాశం దక్కించుకోలేదు. ప్రస్తుతం బాహుబలి చిత్రీకరణలో నిమగ్నమై వున్నా రానా తన తదుపరి చిత్రం తేజ దర్శకత్వంలో ఉండబోతుంది అని ఇప్పటికే ప్రకటించగా ఆ చిత్రంతో తొలిసారి వారి సొంత సంస్థ సురేష్ ప్రొడెక్షన్స్లో పని చేయనున్నారు. మరో పక్క నాగ చైతన్య పలు మార్లు సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలో చేయాలనుకున్నప్పటికీ సరైన కథ దొరకక నేటి వరకు సురేష్ బాబు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కృష్ణ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చినప్పటికీ, చైతు కళ్యాణ్ కృష్ణ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వాలలో సినిమాలు మరియు టూ స్టేట్స్ రీమేక్ కి కమిట్ అవటంతో మరో ఏడాదిన్నఱ సురేష్ ప్రొడక్షన్స్ కి కాల్ షీట్స్ సర్దలేని పరిస్థితిలో వున్నాడు చైతు.
నిర్మాత సురేష్ బాబు చైతు కోసం యేడాదిన్నర్ర ఎదురు చూస్తారో లేక మరో యువ కథానాయకుడితో ఆ కథను తెరకెక్కిస్తారో చూడాలి.

