సుకుమార్ పై డౌటా?

సుకుమార్ దర్శకత్వంలో మొదటిసారి రామ్ చరణ్ అండ్ సమంత రంగస్థలం చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ అంటే లెక్కల మాస్టర్ ఏ కాదు.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు కూడా. అలాగే సుకుమార్ నుండి వచ్చే సినిమాలు అంటే... యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని... విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కిస్తాడనే మాట ఉంది. అలాగే స్టార్ హీరో రామ్ చరణ్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సమంత క్రేజ్ చెప్పక్కర్లేదు. ఆమె పెళ్లి తర్వాత విడుదల కాబోయే చిత్రం రంగస్థలంపై బోలెడు అంచనాలున్నాయి. అలాగే సుకుమార్ ఆస్థాన సంగీత దిగ్గజం దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడమే కాదు... పెద్ద బ్యానర్ అయిన మైత్రి మూవీస్ వారు ఈ సినిమాని నిర్మించడం కూడా ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్.
అలాంటి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి బిజినెస్ సమస్యలున్నాయంటున్నారు. అది నిజమో కాదో క్లారిటీ లేదుగాని... ఫిలింసర్కిల్స్ లో మాత్రం రంగస్థలం సినిమాకి బిజినెస్ సమస్యలున్నాయంటూ కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే రంగస్థలం నైజాం హక్కులను ఈసారి దిల్ రాజు బ్యాచ్ కానీ... ఏషియన్ సునీల్ గాని తీసుకోలేదు. కానీ యువీ క్రియేషన్స్ వారు భారీగా రంగస్థలం నైజం హక్కులను సొంతం చేసుకున్నారని అన్నారు. కానీ.. అధికారికంగా తెలియదు. అయితే ఇప్పుడు యువీ క్రియేషన్స్ వారు వెనుకాముందు ఆలోచిస్తునానట్లుగా టాక్. అంతేకాకుండా మరోపక్క ఆంధ్రలో రంగస్థలం హక్కుల విషయంలోను ఏదో గజిబిజి జరుగుతున్నట్టుగా వినికిడి.
ఆంధ్రలో రంగస్థలం హక్కులను 35 కోట్లకి అమ్మాలని నిర్మాతలు చూస్తుంటే అక్కడనుండి 25 కోట్లకు ఆఫర్ వస్తుందట. ఈ విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్న నిర్మాతలు సినిమా మీద క్రేజ్ తీసుకురావాలని దర్శకుడు సుకుమార్ పై వత్తిడి చేస్తున్నారట. అందుకే సుకుమార్ కూడా రంగస్థలం పాటల్లో సూపర్ అనే వాటిని ఒక్కొక్కటిగా మర్కెట్ లోకి వదులుతూ సినిమా మీద స్పెషల్ క్రేజ్ తీసుకురావడానికి తపన పడుతున్నాడట. రామ్ చరణ్ లుక్, సమంత ల లుక్ విడి విడిగా వదిలినా లాభం లేదనుకున్న సుకుమార్ ఇలా చరణ్ డాన్స్ తో కూడిన సాంగ్స్ తో హైప్ తీసుకురావాలని అనుకున్నాడట. కానీ రంగస్థలం నుండి రామ్ చరణ్, సమంతలు కలిసి ఆడిపాడిన డ్యూయెట్ ఒకటి బయటికొస్తే రంగస్థలంపై ఆటోమాటిక్ గా బజ్ క్రియేట్ అవుతుందని కొందరు సుకుమార్ కి సలహా కూడా ఇస్తున్నారట. మరి రంగస్థలంలో ఒకటే డ్యూయెట్ అనే ప్రచారం కూడా ఉంది. చూద్దాం మరో నాలుగు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోయే రంగస్థలం పరిస్థితి ఏమిటి అనేది.

