సినిమా పోయిందన్నారు

నాని - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఎంసీఏ.. గత గురువారమే విడుదలై యావరేజ్ టాక్ తో కూడా కలెక్షన్స్ దుమ్ము దులుపుతుంది. క్రేజీ కాంబినేషన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందు నుండే మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. అందుకే విడుదలైన మొదటి రోజు సినిమా టాక్ ఎలా వున్నా కలెక్షన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా విడుదలయ్యాక యావరేజ్ టాక్ రావడమే కాకుండా క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి యావరేజ్ రేటింగ్ ఇచ్చి సినిమా మీద హోప్స్ లేకుండా చేశారు. కానీ నాని కున్న క్రేజ్, సాయి పల్లవి క్రేజ్, దిల్ రాజు క్రేజ్ మొత్తంగా ఈ సినిమాని బాక్సాఫీసు వద్ద స్టడీగా నిలబెట్టేశాయి.
ఇకపోతే నాని ఎంసీఏ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటే.. అటు ఓవర్సీస్ లోను కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. యావరేజ్ టాక్ వలన, క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ వలన ఓవర్సీస్ కలెక్షన్స్ మీద ప్రభావం పడలేదు. కేవలం ఎంసీఏ ప్రీమియర్లతోనే 3.03 లక్షల డాలర్లు కొల్లగొట్టేసింది. అలాగే హలో విడుదలైన శుక్రవారం కూడా ఎంసీఏ కి 1.17 లక్షల డాలర్ల వరకు కలెక్షన్లు వచ్చాయంటేనే అక్కడ ఓవర్సీస్ లో ఎంసీఏ సత్తా ఏమిటో తెలుస్తుంది. అయితే ఎంసీఏ వీకెండ్ కన్నా ముందే హాఫ్ మిలియన్ మార్కు దాటేసిందన్నది ట్రేడ్ రిపోర్ట్.
అయితే ఇంతకు ముందు నాని సినిమాలు రెండూ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. వీకెండ్ కలెక్షన్లు స్టడీగా కొనసాగితే ఈ విషయంలో హ్యాట్రిక్ కొట్టిన ఘనత నాని ఖాతాలో పడిపోతుంది అని అంటున్నారు. అలాగే ఎంసీఏ కి మొదటి రోజు అదిరి పోయే కలెక్షన్స్ రావడానికి మరో కారణం ఎంసిఎ విడుదల అయ్యే నాటికి బరిలో ఒక్క సినిమా కూడా లేదు. అంతకు ముందు వారం వచ్చిన సినిమాలన్నీ టపా కట్టేయడంతో పోటీ పడి మరీ థియేటర్లన్ని నానికే ఇచ్చారు. ఈ విధంగా యావరేజ్ అనుకున్న సినిమా కలెక్షన్స్ లో మాత్త్రం హిట్.

