Thu Dec 25 2025 12:44:55 GMT+0000 (Coordinated Universal Time)
సింగం 3 ఫస్ట్ లుక్ సింపుల్ గా వచ్చేసింది


సింగం 3 లో సూర్య ఫస్ట్ లుక్ ను
విడుదల చేసేశారు. దీనితో పాటూ ఓ వర్కింగ్ స్టిల్ ను కూడా విడుదల చేశారు. తెలుగు చిత్రాలకు ఫస్ట్ లుక్ లు విడుదల చేయడానికి జరుగుతున్నంత హంగామా లేకుండా.. సింపుల్ గా సింగం ఫస్ట్ లుక్ వచ్చేయడం విశేషం.
సింగం సిరీస్ లో ఇప్పటికే రెండు చిత్రాలు చేసిన.. తమిళ సూపర్ స్టార్ సూర్య.. ఎంత భారీ హిట్ లు సాధించారో అందరికీ తెలుసు. ఫక్తు మాస్ ఎంటర్టైనర్ లుగా రూపొందిన ఈ సింగం సిరీస్ రెండు చిత్రాలూ తెలుగులో కూడా విపరీతమైన కలెక్షన్లు సాధించాయి. కొంత గ్యాప్ తరువాత ఇప్పుడు సింగం 3 తయారవుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంలోనూ సూర్య సరసన అనుష్క నటిస్తోంది. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ చిత్రాలు ఇవే..

Next Story

