సాయి పల్లవి కోసం సినిమానే మార్చుకున్న హీరో

ఈ మధ్య కాలంలో సాయి పల్లవి క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. 'ఫిదా', 'ఎంసిఏ' చిత్రాలకి ఆ రేంజ్లో ఓపెనింగ్స్ రావడానికి సాయి పల్లవి కూడా కారణమైంది. ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్ లోనే కాదు..మలయాళం, తమిళం చిత్ర సీమలో నుంచి మంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
అయితే సాయి పల్లవి మాత్రం ఏది పడితే అది చెయ్యట్లేదు. తనకు నచ్చింది.. తన పాత్ర బాగుంటేనే ఒకే చేస్తుంది. సినిమా షూటింగ్ కోసం ఆమె డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం కాకుండా తనకోసమే హీరోలు డేట్స్ మార్చుకుని, ప్రాజెక్టులు అటు ఇటు చేసే రేంజ్‌కి వెళ్లింది. టాలీవుడ్ లో హను డైరెక్షన్ లో శర్వానంద్‌తో ఓ సినిమా చేయనుందని సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే ఉండటం వలన..ఈలోపు సుధీర్ వర్మ దర్శకత్వంలో చిత్రం పూర్తి చేసిన తర్వాత దీనిని మొదలు పెడదామని శర్వానంద్ ప్లాన్ చేసుకున్నాడు.
కానీ సాయి పల్లవి డేట్స్ ఫిబ్రవరి నుంచి దొరకడం కష్టమైపోతుందని.. సుధీర్‌వర్మ చిత్రాన్ని వాయిదా వేసి హను సినిమాని ముందుకి తీసుకొచ్చాడు శర్వానంద్. షూటింగ్ వెంటనే మొదలు పెట్టాల్సి రావడంతో హను చకచకా ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాడట. ఒక్క హీరోయిన్ కోసం ఇన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవడంలో ఈమధ్య కాలంలో ఎన్నడూ లేదు

