సాధ్యమేనా డైరెక్టర్ గారు!!

ఎన్టీఆర్ పిచ్చ స్పీడు మీదున్నాడు. ఒక పక్క 'జై లవ కుశ' షూటింగ్.. మరోపక్క బుల్లితెర బిగ్ బాస్ షో. ఇలా రెండు చోట్లా ఇరగదీస్తూ ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ తన తాజా చిత్రం 'జై లవ కుశా'ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 21 న విడుదలకు చక చక రెడీ చేసేస్తున్నాడు. అందులో భాగంగానే షూటింగ్స్ కోసం అధిక సమయాన్ని కేటాయించడమే కాదు 'జై లవ కుశ' పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా తన మూడు పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటున్నాడనే టాక్ ఉండనే ఉంది. ఇక బిగ్ బాస్, జై లవ కుశాని త్వరితగతిన పూర్తి చేసేసి త్రివిక్రమ్ సినిమాకి సిద్దమవుతున్నాడు.
మరి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ షూటింగ్ కూడా ఇక్కడ శరవేగంగానే జరుగుతుంది అంటున్నారు. కానీ బోలెడు బ్యాలెన్స్ షూటింగ్ ఉందంటున్నారు. ఇక పవన్ సినిమా షూటింగ్ కూడా త్రివిక్రమ్ అక్టోబర్ కల్లా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మరోపక్క ఎన్టీఆర్ సినిమాని కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడంటున్నారు. ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కే సినిమాని నవంబర్ 1 న గాని 2 న గాని మొదలుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. హారిక హాసిని బ్యానర్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని మాగ్జిమమ్ నవంబర్ లోనే మొదలు పెడతారని అంటున్నారు.
అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమంటున్నారు కొందరు. ఎందుకంటే త్రివిక్రమ్ - పవన్ సినిమా షూటింగ్ ఇంకా రెండు షెడ్యూల్స్ బ్యాలెన్స్ ఉంది. ఆలాగే ఆ షెడ్యూల్స్ కోసం దాదాపు రెండు నెలలు టైం పట్టె అవకాశం వుంది. మరి అక్టోబర్ కల్లా సినిమాని ఎలా కంప్లీట్ చేస్తారు. అలాగే పవన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకపక్క... మరోపక్క ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కి ఎలా కుదురుతుందనే అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. చూద్దాం త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా ఆఫీషియల్ గా ఎప్పుడు పట్టాలెక్కుతుందో?

