సల్మాన్ చేతిలో పడితే పాతుకుపోద్ది అంతే!

పూజ హెగ్డే తెలుగులో హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది. ఇండస్ట్రీలోకి అడుగెట్టినప్పుడు మాత్రం ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకున్న అమ్మడు డీజే చిత్రానికి వచ్చేసరికి హాట్ హాట్ అందాలతో రెచ్చగొట్టింది. స్విమ్ సూట్ తో ఇరగదీసిన పూజ హెగ్డే కి డీజే చిత్రం హిట్ ఇవ్వకపోయినా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. కోటిన్నర భారీ పారితోషంతో పూజ హెగ్డే శ్రీనివాస్ సినిమాలో నటించడానికి ఒప్పేసుకుంది. అయితే బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ పక్కన మోహింజదారో లో నటించిన పూజ హెగ్డే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో బాలీవుడ్ అవకాశాల మీద ఆశలు వదులుకుంది..... గాని బాలీవుడ్ ని వదలకుండా ఫాషన్ షోలకి, అవార్డు ఫంక్షన్స్ కి హాజరవుతూ అక్కడ హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటూనే అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
అయితే ఇప్పుడు తాజాగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం రేస్ 3 లో పూజ అవకాశం కొట్టేసినట్లుగా వార్తలొస్తున్నాయి. రేస్, రేస్ 2 సినిమాల్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు నటించారు. కానీ ఇప్పుడు రేస్ 3 విషయంలో మాత్రం తక్కువ బడ్జెట్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఇలా తక్కువ బడ్జెట్ ఉన్న హీరోయిన్ ని సెలెక్ట్ చెయ్యడానికి కారణం రేస్ 3 కి నిర్మాత సల్మాన్ కావడమే అంటున్నారు. అందుకే సల్మాన్ ఖాన్ భారీ పారితోషకం తీసుకునే హీరోయిన్స్ ని పక్కన పెట్టి తక్కువ పారితోషకం ఉన్న హీరోయిన్స్ మీద కన్నేశాడట. అయితే ఆ లిస్ట్ మొదటగా పూజ ఉండడంతో పూజ హెగ్డే ని ఫైనల్ చేస్తే ఎలా ఉంటుందని చూస్తున్నాడట.
మరి ఎందరో హీరోయిన్స్ కి మంచి లైఫ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు తన రేస్ 3 లో పూజ ని హీరోయిన్ ని తీసుకుని పూజ లైఫ్ ని కూడా బాలీవుడ్ లో సెటిల్ చేస్తాడేమో చూద్దాం.

