సరైన నిర్ణయం తీసుకున్న సరైనోడు

గత ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి విడుదల కి ముందు వున్న అంచనాలకి విడుదల అనంతరం తోడైన పబ్లిసిటీ అన్ని కలిసి కూడా సినిమా ని హిట్ గా నిలపలేకపోయాయి. హరీష్ శంకర్ రచించిన ఆ చిత్ర కథలో అల్లు అర్జున్ పోషించిన బ్రాహ్మణ పాత్ర తప్ప మరే కొత్తదనం లేకపోవటంతో ఆ చిత్రానికి ఆశించిన స్థాయి ఫలితం దక్కలేదు. దానితో కమర్షియల్ ఎలెమెంట్స్ మెండుగా వుండే ఒక సోషల్ మెసేజ్ వున్న సబ్జెక్టు చేయాలనే యోచనతో వక్కంతం వంశి చెప్పిన కథని ఓకే చేసి వెంటనే పట్టాలెక్కించేసాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఇటీవల విడుదలైన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ అనూహ్యమైన స్పందన దక్కించుకుంది. కాగా ఇలాంటి సోషల్ మెసేజ్ వున్న కమర్షియల్ చిత్రం అనంతరం బన్నీ చేయబోయే చిత్రంపై అభిమానులలో చర్చ జోరుగా నడుస్తోంది. మూడు సంవత్సరాల నుంచి తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సోషల్ మెసేజ్ తో కూడిన చిత్రం బన్నీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే లింగుస్వామి కథ నేరేట్ చేయగా తమిళ నేటివిటీ అధికంగా వున్న కథ కావటంతో బన్నీ ఈ ప్రాజెక్ట్ ని సున్నితంగా తిరస్కరిస్తూ బైటకి వచ్చేశాడట. స్పైడర్ చిత్రంలో కూడా తమిళ దర్శకుడు మురగదాస్ కథా రచనలో తమిళ నేటివిటీ అధికమై తెలుగు ప్రేక్షకులకి రుచించని విధంగా ఆ చిత్రం తయారైంది. దీనితో ఇప్పుడు బన్నీ సరైన నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు

