Sun Dec 21 2025 20:43:04 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి రాజు కి ఈ మోజు పుట్టింది ఏంటో?

సుమంత్ ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు కొంత కాలం క్రితం అగ్ర నిర్మాతగా వెలుగొందారు. ఆయన వరుస సంవత్సరాలలో సంక్రాంతి పోటీలో ఆయన చిత్రాలను విడుదల చేసి వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఎం.ఎస్.రాజు కాస్తా సంక్రాంతి రాజుగా మారిపోయారు. తరువాతి కాలం లో ఆయన నిర్మాణంలో కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ కి చిన్న హీరోగా ఎదగటానికి మంచి ప్లాట్ఫామ్ కల్పించారు.
చిత్ర నిర్మాణమే కాకుండా వాన చిత్రంతో దర్శకుడిగానూ మారారు ఎం.ఎస్.రాజు. కాగా ఆ చిత్రం మ్యూజికల్ హిట్ గా మాత్రమే నిలిచింది తప్ప, కథ కథనాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇప్పుడు ఎం.ఎస్.రాజు రతి అనే అడల్ట్ చిత్రం ద్వారా మళ్లీ దర్శకత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథ ఒక లఘు చిత్రాల రూపకర్త ఎం.ఎస్.రాజు నిర్మాణంలో దర్శకత్వ అవకాశం కోసం కలిసి వినిపించగా, రాజు కథను సొంతం చేసుకుని, ఆ లఘు చిత్రాల దర్శకుడికి మరో చిత్రానికి దర్శకత్వం కలిపిస్తానని మాట ఇచ్చి ఆయనే స్వీయ దర్శకత్వం చేస్తున్నారు.
కథ విన్న వెంటనే సొంతంగా ఆరు భాషల్లో రూపొందించాలి అనేంతగా రాజు గారి రతి కథ పై ఎం మోజు కలిగిందో మరి...
Next Story

