షాకింగ్ లుక్ లో అనుష్క

అరుంధతిలో అరుంధతి పాత్రలో.... బాహుబలిలో దేవసేన పాత్రలో... రుద్రమదేవిలో రుద్రమ దేవి పాత్రలో రాణిహాసం ఉట్టిపడేలా కనిపించిన అనుష్క తాజా చిత్రం భాగమతి లో ఎలా కనబడుతుందో అనే క్యూరియాసిటీతో ఉన్నారు అభిమానులు. రెండేళ్ల నుండి దర్శకుడు అశోక్ చెక్కుతున్న భాగమతి సినిమాలో అనుష్క భాగమతి పాత్ర పోషించనుందనే న్యూస్ తప్ప ఈ సినిమాకి సంబందించిన మారె న్యూస్ లేదు మీడియాలో. కానీ ఇన్నాళ్లకు అనుష్క పుట్టినరోజు కానుకగా భాగమతి ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ భాగమతి లుక్ లో అనుష్క ఈ మధ్యన ఎన్నడూ కనబడని సన్నని లుక్ లో దర్శనమిచ్చింది. చాలా సన్నగా కనబడుతున్న ఈ భాగమతి లుక్ లో అనుష్క మాస్ తరహాలో ఒక చేతిలో సుత్తి మరో చేతిలో కత్తి గాటు గాయంతో రఫ్ లుక్ లో కనబడి అందరిని ఆశ్చర్యపరిచింది. భాగమతి అంటే ఏదో యువరాణి పాత్రలా అనుష్క కనబడుతుంది అనుకుంటే.... ఇదేమిటి ఇలా వెరైటీ లుక్ లో అనుష్క కనబడింది అనుకుంటున్నారు అభిమానులు. మరి అనుష్క లుక్ యేసుక్రీస్తు కి సిలువ వేసినప్పుడు ఎలా ఉంటుందో అచ్చం అలాంటి లుక్ నే తలపిస్తుంది. అనుష్క నించున్న బ్యాగ్రౌండ్ లో యేసుక్రీస్తు కి సంబందించిన కొన్ని ఆధారాలు కూడా కనబడుతున్నాయి.
ఇకపోతే ఈ మధ్యన కాస్త బొద్దుగా కనబడుతున్న అనుష్క ఈ సినిమా లుక్ లో మాత్రం చాలా సన్నగా కనబడుతుంది అంటే.... ఈ పోస్టర్ లో అనుష్క ని ఫోటో షాప్ లో బాగానే సన్నబడేసారనిపిస్తుంది. మరి భాగమతి లో అనుష్క కోసం ఐదు కోట్లు పెట్టి గ్రాఫిక్స్ వర్క్ చేపిస్తున్నారన్నప్పుడే... ఈ సినిమాలో అనుష్క సన్నగా కనబడుతుందని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు అది వేరే విషయం. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ చివర్లోగాని... లేకుంటే జనవరిలో గాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నాడు.

