శ్రీను వైట్లతో కుదిరింది

శ్రీను వైట్ల, ఇతని పేరు వింటే మనకి ముందు అతను తీసిన హిట్ సినిమాలు కన్న అతను తీసిన ప్లాప్ సినిమాలే ఎక్కువ గుర్తుంటాయి. ఈ డైరెక్టర్ అసలు ఫామ్ లో లేడు. లేటెస్ట్ గా శ్రీను వైట్ల తీసిన 'మిస్టర్' సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఇంకా శ్రీను వైట్ల కష్టమే అన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఫామ్ లో వున్న రవి తేజ...శ్రీను వైట్లకు ఛాన్స్ ఇచ్చాడు.
శ్రీను వైట్ల కెరీర్ స్టార్టింగ్ లో రవి తేజ మంచి హెల్ప్ అయ్యాడు. అలానే మళ్లీ ఇప్పుడు హెల్ప్ అవుతున్నాడు రవి తేజ. వీరిద్దరూ రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోయారు. అయితే ఇద్దరు ఒకేసారి మళ్లీ డౌన్ అయ్యారు. కానీ రవి తేజ ఇప్పుడు పికప్ అయ్యి శ్రీను వైట్లను లిఫ్ట్ చేయాలని చూస్తున్నాడు.
అసలు విషయం ఏంటంటే... వీరి కాంబినేషన్ మళ్లీ ఒక మంచి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కథ తెరకెక్కడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్నీ రవి తేజ లేటెస్ట్ సోషల్ మీడియా చిట్ చాట్ లో తెలిపాడు. ప్రస్తుతం రవి తేజ 'టచ్ చేసి చూడు' విడుదలకు సిద్ధం అయింది. అలాగే కళ్యాన్ కృష్ణ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. ఈ సినిమా తర్వాత శ్రీనుతో సినిమా చేసే అవకాశంవుందని తెలుస్తుంది. మరి వీరి కాంబినేషన్ లో నాలుగోసారి వచ్చే ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

