Sun Dec 21 2025 22:16:11 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీను వైట్ల సేఫ్, మరి శేఖర్ కమ్ముల?

శ్రీను వైట్ల, శేఖర్ కమ్ముల ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుల హోదా లో భారీ విజయాలు ఎంజాయ్ చేసినవారే. కాకపోతే ఇద్దరిది చెరొక దారి. ఈ ఇద్దరు దర్శకులు తీసే సినిమాల శైలి ఒకరికొకరికి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీను వైట్ల మిస్టర్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, శేఖర్ కమ్ముల ఫిదా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలకి కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆగడు, బ్రూస్ లీ చిత్రాలతో పరాజయాల పరాభవం చవి చూసిన శ్రీను వైట్ల కి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక చిత్రాలతో కంగుతిన్న శేఖర్ కమ్ముల కి వరుణ్ తేజ్ తో తెరకెక్కుతున్న చిత్రాల విజయాలు చాలా కీలకం కానున్నాయి.
పార్లల్ గా రెండు చిత్రాలను పూర్తి చేసి 2017 ఉగాది లోగా విడుదల చెయ్యాలని యోచించిన వరుణ్ తేజ్ కి దురదృష్టవ శాత్తు పెద్ద ఎదురు దెబ్బె తగిలింది. ఆయన మిస్టర్ చిత్రీకరణలో భాగంగా కర్ణాటకలో పోరాట సన్నివేశాలు తానే స్వయంగా రోప్ సహాయం లేకుండా చెయ్యటంతో కాలికి తీవ్ర గాయమై దాదాపు రెండు నెలలు చిత్రీకరణల నుంచి విరామం తీనుకున్నాడు. ఇప్పుడు తిరిగి చిత్రీకరణలో పాల్గొనటానికి వరుస కాల్ షీట్స్ శ్రీను వైట్ల చిత్రానికి ఇచ్చేసాడు వరుణ్ తేజ్. మరి శేఖర్ కమ్ముల ఎంత కాలం ఎదురు చూడాలో ఇంకా స్పష్టత లేదు. అసలే కథ దశలోనే ఎక్కువ కాలం తీసుకునే శేఖర్ కమ్ములకు షూటింగ్ బ్రేక్ రావటం పెద్ద తలనొప్పిగా తయారు ఐయ్యింది పాపం.
Next Story

